చాలా మంది భోజనం చేశాక టూత్‌పిక్‌లను వాడుతుంటారు. అలా టూత్‌పిక్‌లను వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్‌పిక్‌లను వాడితే చిగుళ్లు దెబ్బతింటాయి. దీంతో చిగుళ్లల్లో రక్తస్రావం జరిగి.. నోటి లోపల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపించి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే ఏదైనా ఆహారం దంతాలలో ఇరుక్కుపోతే, వాటిని గోరువెచ్చని నీటితో బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.