శీతాకాలంలో పురుషులు, స్త్రీల మూత్రంలో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉంటుందని, ఈ స్థితి రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన కథనంలో వివరించారు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల మూత్రం పరిమాణం తగ్గడమే కాక గాఢత పెరిగి, అనవసరమైన మూలకాలు, ఖనిజాలు పేరుకుపోతాయని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ PS.వలీ తెలిపారు. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందని పేర్కొన్నారు.