’పెళ్లప్పుడు ఆడపడుచుకు ఆస్తి, కట్నం ఇచ్చేశాం కాబట్టి మిగిలిన ఆస్తి అంతా నా కొడుక్కే చెందుతుంది‘ అని మీ మామ ఓ వీలునామా రాస్తే ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంది. వీలునామా రాయకుండా చనిపోతే.. కూతుళ్లకు రాసి ఇవ్వగా మిగిలిన ఆస్తికి మళ్లీ పిల్లలంతా వారసులే అవుతారు. హిందూ వివాహచట్టం ప్రకారం వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తి భార్యకు ఒక భాగం, పిల్లలకు ఒక్కో భాగం చొప్పున చెందుతాయి. లేదా తల్లికి ఒక భాగం, చనిపోయిన కొడుకు పిల్లలు లేదా మరణించిన కూతురు పిల్లలు హక్కుదారులవుతారు.