చాలామందికి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే ఇలా ఉదయాన్నే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, కడుపు మంట వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇంకా మూత్రపిండాలపై ఒత్తిడి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనికి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ తాగడం మంచిదని సూచిస్తున్నారు.