నకిలీ అఘోరీపై చీటింగ్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గోవిందానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగేటప్పుడు తరిమి కొట్టాలని, ఎదిరించాలని ప్రజలకు ఆయన సూచించారు. భారతదేశంలో అఘోరీలు, నాగ సన్యాసులు ఎక్కడ ఉంటారో తనకు తెలుసని పేర్కొన్నారు. 2025లో మహాకుంభం రానుందని.. నిజమైన అఘోరీలు, అఖడాలు అక్కడికి వస్తారని ఆయన తెలిపారు.