అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది. దీంతో పలు ఇళ్లలోని అద్దాలు, సామాన్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.