మొక్క జొన్నలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయిని నిపుణులు చెబుతున్నారు. మొక్క జొన్నలో ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.