మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నాల్ని సహించం: అజిత్ పవార్
రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేసే ప్రయత్నాలను సహించబోమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. లౌకిక రాజకీయాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎప్పుడూ ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక సామరస్యానికి నిలయం. ఎన్సీపీ ఐక్యమత్యం, లౌకికవాదం వైపే నిలబడుతుంది. వివిధ వర్గాల్లో విద్వేష బీజాలను నాటే వారిని, విభజన రాజకీయాల్లో పాల్గొనేవారిని మేం సహించం అన్నారు.