మనలో చాలా మందికి సీమ వంకాయ అంటే తెలిసి ఉండదు. దీనినే బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. అయితే సీమ వంకాయను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది.