మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అరవింద్ అనే యువకుడు బైక్ నడుపుతుండగా తన జేబులోని సెల్ ఫోన్ పేలింది. దీంతో బైక్ నుంచి అతను కిందపడిపోవడంతో ఆ యువకుడి వృషణాలకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పానీపూరీ విక్రయించే అతను ఇటీవలే ఓ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాడని, రాత్రంతా ఛార్జింగ్ పెట్టాడని తన సోదరుడు వెల్లడించాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపాడు.