లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన కర్ణాటక హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని మరోసారి పొడిగించారు. ప్రజ్వల్ కస్టడీని ఈనెల 10 వరకు పొడిగిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. కాాగా, ప్రజ్వల్ రేవణ్ణ తనను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించడం లేదని తెలిసింది. ‘నాకేం తెలీదు.. నేను నిర్దోషిని.. నన్ను కుట్ర చేసి ఈ కేసులో ఇరికించారు’ అన్న సమాధానమే ఆయన నుంచి వస్తున్నట్టు సమాచారం.