ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. కరీంనగర్‌లోని సహస్ర కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థిని నీలి సాన్వి ఎగ్జామ్ రాస్తుండగా.. గదిలో తిరుగుతున్న ఫ్యాన్ తనపై పడింది. సాన్వికి స్వల్ప గాయాలయ్యాయి. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ముక్కుకు గాయం అవ్వడంతో బ్యాండెజ్ వేశారు. చికిత్స కోసం కాస్త బ్రేక్ తీసుకోవడంతో, అదనంగా మరో అర్ధగంట సమయం పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు.