ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటనే అంతర పంట అంటారు. అంతర పంటలతో రైతులు మంచి లాభాలను పొందవచ్చు. దీనితో రైతుకు అదనపు ఆదాయం సమకూరటంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతర పంటల విధానంలో నేలకోత తగ్గుతుంది. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది.