తప్పిపోయిన కన్నతండ్రి ఆరేళ్ల తర్వాత కనిపించడంతో ఆయన కూతుళ్లు భావోద్వేగానికి లోనాయ్యరు. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన బాలయ్య అనే వ్యక్తి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా.. అతన్ని మాతృదేవోభవ అనాథాశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఇటీవల అదే ఆశ్రమంలో అన్నదానం చేయడానికి బాలయ్య కూతుర్లు వచ్చారు. ఈ క్రమంలో బాలయ్యను గుర్తుపట్టిన కూతుళ్లు తండ్రిని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.