నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలిసింది. 1884లో బి.ఎలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తండ్రి మరణించాడని పిడుగు లాంటి వార్త తెలిసింది. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. చాలారోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు