అప్సర హత్య కేసులో తుది తీర్పు రిజర్వ్

69చూసినవారు
అప్సర హత్య కేసులో తుది తీర్పు రిజర్వ్
TG: హైదరాబాద్ సరూర్ నగర్ లో సంచలనం కలిగించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇరువైపులు వాదనలు విన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మార్చి 21వ తేదీకి తీర్పును వాయిదా వేసింది.
 పూజారి అయిన సాయి కృష్ణ.. అప్సర అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో, అడ్డు తొలగించుకోవాలని అతడు కుట్ర చేశాడు. గోవాకు వెళ్దామని తీసుకెళ్లి ఆమెను హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు.

సంబంధిత పోస్ట్