ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. నరేలాలోని భోర్‌గఢ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 30 ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.