బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో తొలి మరణం: WHO

56చూసినవారు
బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో తొలి మరణం: WHO
మెక్సికోలో H5N2 వేరియంట్ బర్డ్ ఫ్లూతో ఒక వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదేనని పేర్కొంది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24 న మరణించినట్లు పేర్కొంది. దీనిపై తమకు సమాచారం అందిందని మెక్సికో వెల్లడించింది. అయితే అతడు పౌల్ట్రీ, జంతువుల వద్దకు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.

సంబంధిత పోస్ట్