సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'జాక్'. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఏ ఉప్పనలూ చూడక్కర్లే.. తన ఉత్సాహం చూస్తే చాలదా.. ఏ అద్భుతం చూడక్కర్లా.. తన పోరాటం చూస్తే చాలదా..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.