భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎస్) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ‘సునీల్ ఛెత్రి తిరిగి వచ్చాడు. కెప్టెన్, నాయకుడు, లెజెండ్ మార్చిలో FIFA ఇంటర్నేషనల్ విండో కోసం భారత జాతీయ జట్టుకు తిరిగి వస్తాడు’ అని ట్వీట్ చేసింది. అయితే మార్చి 25న బంగ్లాదేశ్‌తో జరగనున్న AFC ఆసియా కప్ 2027 క్యాలిఫయర్స్ మూడో రౌండ్‌లో సునీల్ ఛెత్రి ఆడనున్నాడు.