భారత్ మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ (95) మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈయన భారత్ తరపున 11 టెస్టు మ్యాచులు ఆడారు. 1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా ఉన్నారు. పలు మ్యాచులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3139 రన్స్ చేశారు. ఆయన కుమారుడు అంశుమన్ గైక్వాడ్ కూడా భారత్ తరపున క్రికెట్ ఆడారు.