లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు

59చూసినవారు
లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
TG: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ను లగచర్ల గ్రామస్థులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆ గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ తీరు అమానుషమని, లగచర్ల వాసులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్