కౌకుంట్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

61చూసినవారు
కౌకుంట్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
సెక్రటేరియట్ లో శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా కౌకుంట్ల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్