బాలానగర్ లో ఈదురు గాలులతో భారీ వర్షం
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామంలో ఆదివారం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. వేసవి దుక్కులు దున్నడానికి ఈ వర్షం అనుకూలంగా మారిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.