మాగనూరు: ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి
ఉపాధ్యాయులను వేధిస్తు, తప్పుడు సమాచారాన్ని పత్రికా మిత్రులకు తెలియజేసి ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్న మాగనూరు ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని గురువారం టీఎస్ యుటిఎఫ్ నాయకులు డీఈవో కు వినతి పత్రం అందించారు. ఎంఈఓ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండడం లేదని, సెలవులు మంజూరు చేయడంలో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ రాములు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.