ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Sep 07, 2024, 12:09 IST/

వినాయక చవితి రోజు ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Sep 07, 2024, 12:09 IST
నేడు వినాయక చవితి పండుగ. ఈ రోజున కొన్ని పనులు చేయొద్దని పండితులు చెబుతున్నారు. 1. తులసి దళాలు: బొజ్జ గణపయ్య పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. తులసిని వినాయకుడు శపించాడని పురణాలు చెబుతున్నాయి. 2. చంద్రుడు: శివుడి శిగలో ఉండే చంద్రుడు ఒకసారి వినాయకుడి గజరరూపాన్ని వెక్కిరించాడని.. ఆ రోజున చంద్రుడిని చూస్తే కష్టాలు పడతారని నమ్మకం. 3. వెండి పాత్రలు: గణేశుడి పూజలో వెండి పాత్రలు, తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. 4. విరిగిన బియ్యం: వినాయకుని పూజలో విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదు. 5. మొగలి పువ్వులు: శివుడు మొగలి పువ్వుని శపింస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుని పూజలో వీటిని ఉపయోగించరాదు. 6. ఎండిన పువ్వులు: వినాయకుని పూజలో పొరపాటున కూడా ఎండిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు.