అత్యాచారానికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ

82చూసినవారు
కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా శుక్రవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ. వైద్య విద్యార్థిని పై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన దుండగుడిని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్