జిల్లా ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపి ద్వారా అపెండెక్స్ ఆపరేషన్

532చూసినవారు
జిల్లా ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపి ద్వారా అపెండెక్స్ ఆపరేషన్
నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో శనివారం మొదటిసారిగా వైద్య సిబ్బంది ఓ రోగికి లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ధన్వాడ మండలం కొత్తపల్లికి చెందిన అయ్యప్ప కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. రోగిని పరీక్షించిన వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని సూచించారు. దింతో లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ చేసినట్లు సూపరింటెండెంట్ రంజిత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్