AP: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని దారుణ ఘటన జరిగింది. మత్తుమందు ఇచ్చి వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కోరికను తీర్చకుంటే భర్తను చంపేస్తామంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. అలాగే నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ.2.50 లక్షలు వసూలు చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులైన యర్రం శెట్టి రవి, సోము లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.