చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో గంగోత్రి ధామ్ తలుపులను ఇవాళ మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం ముఖ్భాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులను కూడా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేయనున్నట్లు సమాచారం.