హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తోన్న దాడులకు అక్కడి ప్రజలు తమ ఇళ్లను వీడారు. సురక్షిత శిబిరాల్లో తన దాచుకుంటున్నారు. అక్కడ దువ్వెనలు, షాంపూలు లేకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు పడుతోన్న క్రోభ చూసి స్థానికంగా సేవలు అందిస్తోన్న వైద్యులు జుట్టు కత్తిరించుకోవాలని అమ్మాయిలకు సూచిస్తున్నారు.