తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 98వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రాజెక్టులో నీటిమట్టం 1074.2అడుగులకు చేరుకుంది. ఇంకా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, జయశంకర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీలకు వరద పోటెత్తుతుంది.