దేశంలో ఎక్కడ లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్‌ఎఫ్‌టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సుమారు రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశారు. గతేడాది నవంబర్‌లో తాపడం పనులను ప్రారంభించి ఈ నెల 10 తేదిన పూర్తిచేశారు.