ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఇంగ్లీష్‌ను సులువుగా ప్రాక్టీస్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా భారత్‌తో పాటు అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేసియా, మెక్సికో, వెనిజులా దేశాల్లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది.