TG: బడ్జెట్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇది పేదల బడ్జెట్ అని అన్నారు. ఎకరానికి రైతు భరోసా రూ.12 వేలు, రైతుకూలీలకు ఇందిరమ్మ రైతుభరోసా కింద రూ.12 వేలు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు.