ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో గూడ్స్ రైలు, కంటైనర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లక్నో-వారణాసి రైలు విభాగంలో రైల్వేక్రాసింగ్ వద్ద కంటైనర్ ట్రక్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ట్రక్ డ్రైవర్ సోను చౌదరి (28) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సోనును ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.