మందు బాబుల ద్వారా సర్కార్‌కు రూ. 27 వేల కోట్ల ఆదాయం

50చూసినవారు
మందు బాబుల ద్వారా సర్కార్‌కు రూ. 27 వేల కోట్ల ఆదాయం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయా మార్గాల అంచనాను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ అంటే మందు, లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం అంచనా 27 వేల 623 కోట్ల రూపాయలుగా సర్కార్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర పన్నుల రాబడి అంచనా ఒక లక్షా 45 వేల 419 కోట్లుగా స్పష్టం చేసింది. కాగా ఇదే ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూర్చనున్నట్లు భట్టి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్