మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నేటితో ముగిసింది. మరాఠాల డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో ఉద్యమకారుడు మనోజ్ జరాంగే శనివారం ఉదయం నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.