జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

52చూసినవారు
జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు
TG: వర్షాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే జనవరి 31 వరకు కొనసాగుతాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 8,086కేంద్రాలు ఏర్పాటు చేశామని, విక్రయాలు జరిగిన వెంటనే మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500చొప్పున బోనస్ నూ చెల్లిస్తున్నామన్నారు. అలాగే రేషన్ లో సన్నబియ్యం ఉగాది నుంచి పంపిణీ చేయొచ్చని చెప్పారు.

సంబంధిత పోస్ట్