దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్)ను 232/2 స్కోరుతో ఆరంభించిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్ 9.2 ఓవర్లలో పూర్తి చేసి విజయాన్ని అందుకుంది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 603/6 డిక్లేర్డ్ రికార్డు స్కోరు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 266 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది.