కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం మాటలతో దాడులు చేస్తే.. ఆ పార్టీ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదేనా మీరు చెప్పే ఇందిరమ్మ రాజ్యం? ప్రజా పాలన? అంటూ ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ పాలనలో దాడులు జరిగి ఉంటే మాట్లాడే పరిస్థితులు ఉండేవా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొంది’ అని విమర్శించారు.