పుచ్చకాయ పక్వానికి వచ్చినప్పుడు కాయ మొదట్లో ఉన్న తీగ ఎండిపోతుంది. కాయ నేలకు తగిలే భారం పసుపు రంగుకు మారుతుంది. కాయను చేతితో తడితే కంచు శబ్ధం వస్తుంది. పండు తెలుపు నుంచి పసుపుకు మారగానే కోసుకోవాలి. పుచ్చసాగుతో హెక్టారుకు 25 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తూ రైతులు మంచి లాభాలను పొందుతున్నారు.