పాముల గురించి నిత్యం వార్తలు వైరలవుతూ ఉంటాయి. తాజాగా ఓ కొండచిలువ మల విసర్జన చేస్తున్న ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ తమ ఫేస్‌బుక్ పేజీలో నమ్మశక్యం కాని ఈ చిత్రాన్ని షేర్ చేశారు. “ఏం లోపలికి వెళ్లినా, తప్పక బయటకు వస్తుంది” అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. చిత్రంలో ఒక పెద్ద కొండచిలువ ఇంటి పైకప్పుపై నుండి మల విసర్జన చేస్తుంది. దాని వ్యర్థాల పరిమాణం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.