పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రభాకర్‌తో బొంతా సత్యపద్మకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించాలని భావించి.. ఓ మహిళా ఏజెంట్‌కు రూ.2 లక్షలను చెల్లించి సత్యపద్మ మస్కట్‌కు వెళ్లారు. మస్కట్‌లో యజమానుల ఇబ్బందులు తట్టుకోలేకపోవడంతో.. సత్యపద్మను వెనక్కి పంపించాలని భర్త ఆ ఏజెంట్‌ను అడగ్గా.. మరో రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆమెకు ఆ డబ్బులను ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఇంటికి తిరిగొస్తుందనుకుంటే ఆమె విగతజీవిగా తిరిగొచ్చారు.