తుంగభద్రకు భారీగా వరద

77చూసినవారు
తుంగభద్రకు భారీగా వరద
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1580.23 అడుగులకు చేరుకుంది. 4,817 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోందని, ప్రస్తుతం జలాశయంలో 4.58 టీఎంసీల వరద నీరు నిలువ ఉన్నట్లు జలాశయం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్