ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా కేదార్‌నాథ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు రానున్న 5 రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.