ఢిల్లీలో భారీ వర్షం.. స్కూళ్లకు సెలవు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో అయితే ఒక గంట వ్యవధిలోనే 11 సెంమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.