భారీ వర్షాలు.. 50 మంది మృత్యువాత

67చూసినవారు
భారీ వర్షాలు.. 50 మంది మృత్యువాత
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా, తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు 50 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదలతో ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్