కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు

6221చూసినవారు
కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌ను కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. కేసు కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన కోర్టు కేసును డిస్మిస్ చేసింది.