స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను రాజకీయ చైతన్యులుగా చేయడానికి ‘సాధన’ అనే ఆంగ్ల పత్రికను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్ధాపించారు. గోపాలకృష్ణయ్య సంస్కృతం, తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో నిష్ణాతుడు. తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు వంటి ఎన్నో జానపద కళారీతులను ఆయన ప్రచారం చేశారు. దీనితో 1921లో గుంటూరులో “ఆంధ్ర రత్న” అనే బిరుదుతో ఆయనను సత్కరించారు.